- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
తిరుమలలో ప్రత్యక్షమైన గోల్డ్ మ్యాన్..చూస్తే షాక్ అవ్వాల్సిందే?
దిశ,తిరుమల:తిరుమలలో నిత్యం వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు. శుక్రవారం కూడా ఓ భక్తుడు శ్రీవారిని దర్శించుకొని బయటకు వచ్చాడు. అతడిని చూసి అంతా షాకయ్యారు. అతని ఒంటి నిండా బంగారు ఆభరణాలున్నాయి. శ్రీ వెంకటేశ్వరుని దర్శనార్థం తిరుమలకు నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తుల్లో కొందరు భక్తులు మాత్రం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. తిరుమలకు శుక్రవారం నాడు గుంటూరు నుంచి వచ్చిన ఓ భక్తుడిని చూసి ఇలాగే ఆశ్చర్యానికి లోనయ్యారు మిగతా భక్తులు.
గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం, పెదవడ్లపూడి గ్రామంలో నివాసం ఉంటున్న గడ్డిపాటి సాంబశివరావు శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. చేతి వేళ్లకు పెద్ద పెద్ద ఉంగరలు, కుడి మరియు ఎడమ చేతికి భారీ కంకణం, మెడలో పెద్ద చైన్ లతో పాటుగా శ్రీ వెంకటేశ్వర స్వామి డాలర్ వేసుకున్నారు. సుమారు 3 కేజీల బరువు గల బంగారు ఆభరణాలు ధరించి శ్రీవారిని దర్శించుకున్నారు.ఆ వ్యక్తి పేరు గడ్డిపాటి సాంబశివరావు. శ్రీవారి ఆలయం ముందు సాంబశివరావు భక్తులందరినీ ఆకర్షిస్తున్నారు. వామ్మో ఇన్ని ఆభరణాలతో తిరుమల వచ్చారా అని అంతా అవాక్కవుతున్నారు.
Read More..