తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జి విచారణ.. బాధితుల వాంగ్మూలం సేకరణ

by srinivas |   ( Updated:2025-02-27 16:46:13.0  )
తిరుపతి తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జి విచారణ.. బాధితుల వాంగ్మూలం సేకరణ
X

దిశ, వెబ్ డెస్క్: తిరుపతి(Tiruapati) తొక్కిసలాటపై రిటైర్డ్ జడ్జి(Retired Judge) విచారణ చేపట్టారు. వర్చువల్ విధానంలో 9 మంది బాధితుల నుంచి వాంగ్మూలం సేకరించారు. తిరుపతి కలెక్టరేట్‌(Tirupati Collectorate)లోని తాత్కాలిక కార్యాలయం నుంచి విచారణ చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన భక్తుడి నుంచి సైతం వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. కాగా తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వారా దర్శనం(Tirumala Srivari Vaikuntha Darshan) సందర్భంగా టోకెన్ల కోసం తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ తొక్కిసలాటలో పలువురు మృతి చెందగా.. మరికొంత మందికి గాయాలయ్యాయి. దీంతో బాధిత కుటుంబాలకు పరిహారం అందజేశారు. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్యూరిటీ వైఫల్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు విమర్శలు వెల్లువెత్తాయి. తాజాగా విశ్రాంత న్యాయమూర్తి విచారణ చేపట్టారు. బాధితులతో మాట్లాడి తొక్కిసలాటకు సంబంధించిన విషయాలను రికార్డు చేశారు.



Next Story