- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఎర్రకోటలో పంద్రాగస్ట్ వేడుకలకు.. కుప్పం మహిళా రైతుకు ఆహ్వానం
దిశ, వెబ్ డెస్క్: చిత్తూరు జిల్లా కుప్పం కు చెందిన మహిళా రైతుకు అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో జరిగే ఎర్రకోట పంద్రాగస్టు వేడుకలకు ఆహ్వానం లభించింది. ఆగస్టు 15 న జరగబోయే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు అతిథిగా వెళ్లనుంది కుప్పం మహిళా రైతు మునిలక్ష్మీ. ఈమె కుప్పం మండలం వెండుగాం పల్లిలో భర్త నారాయణ తో కలిసి ఆదర్శ వ్యవసాయం చేస్తుంది. పీఎం కిసాన్ లబ్ధిదారురాలిగా ఉన్న మునిలక్ష్మీ వ్యవసాయంలో రాణిస్తోంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పీఎం కిసాన్ లబ్దిదారులైన నలుగురిని ఎంపిక చేయగా.. అందులోనే ఉమ్మడి చిత్తూరుకు చెందిన మునిలక్ష్మీ కూడా ఉన్నారు. ఆమెతో పాటు శ్రీకాకుళం నుంచి దోమ మోహన్, ప్రకాశం నుంచి మాల్యాద్రి, ఏలూరు నుంచి నాగమణి లు కూడా ఎంపికయ్యారు. ఈ అరుదైన గౌరవం దక్కిన మునిలక్ష్మీ దంపతులను స్థానికులతో పాటు, కుప్పం టీడీపీ నేతలు అభినందించారు. అయితే ఇప్పటికే ఈ దంపతులు ఢిల్లీకి బయలు వెళ్లారు.