- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Breaking: కుప్పంలో భారీగా కర్ణాటక మద్యం పట్టివేత
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో మే 13న ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ కొనసాగుతోంది. దీంతో ఎన్నికల ఫైయింగ్ స్క్వాడ్ అధికారులు, పోలీసులు ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. డబ్బు, మద్యం తరలింపుపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ మధ్యం పట్టుబడింది. కొందరు వ్యక్తులు కర్ణాటక నుంచి గుడుపల్లి మండలం సోడిగానీపల్లికి మద్యం తరలిస్తూ పట్టుబడ్డారు. ఎన్నికల్లో ఓటర్లకు ప్రలోభపెట్టేందుకు మద్యం తరలిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. మొత్తం 6 లక్షల విలువైన మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల అధికారులు హెచ్చరించారు. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల మద్యం తరలింపుపై నిషేధం ఉందని.. ఎవరైనా ప్రయత్నాలు చేస్తే కేసులు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.