- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీకి ప్రత్యేక హోదాపై సచిన్ పైలట్ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి తారక రామ గ్రౌండ్‌లో ఏపీసీసీ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో ఏఐసీసీ సీనియర్ నేత సచిన్ పైలెట్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సచిన్ పైలట్ మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో వచ్చిన వెంటనే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్లు ప్రత్యేక హోదా ఇచ్చిందని చెప్పారు. క్యాబినెట్ ఆమోద ముద్ర వేసిందని, ఆర్థిక శాఖకి కూడా పంపించామని తెలిపారు. ఎన్నికల్లో ఆంధ్రకి 10 ఏళ్లు హోదా ఇస్తామని మోడీ మాట ఇచ్చారని గుర్తు చేశారు. గత 10 ఏళ్లుగా మోడీ ప్రధానిగా ఉన్నారని, హోదా హామీని మాత్రం మరిచారని విమర్శించారు. ఈ రాష్ట్రాన్ని పాలించిన స్థానిక పార్టీలు కూడా హోదా సాధనలో విఫలమయ్యాయని ఎద్దేవా చేశారు. రైతులను,నిరుద్యోగులను బీజేపీ పూర్తిగా విస్మరించిందన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాష్ట్రానికి ఒక్క రూపాయి రాలేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే చేసి తీరుతుందని, వచ్చే ఎన్నికల్లో ఏపీ ప్రజలు తమను ఆశీర్వదించాలని సచిన్ పైలట్ కోరారు.