చంద్రబాబుకు బెయిలొచ్చినా ఆగని ఆందోళన: మిగిలిన కేసుల్లో తీర్పులపై ఉత్కంఠ

by Seetharam |   ( Updated:2023-11-21 11:16:23.0  )
చంద్రబాబుకు బెయిలొచ్చినా ఆగని ఆందోళన:  మిగిలిన కేసుల్లో తీర్పులపై ఉత్కంఠ
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకి స్కిల్ డవలప్‌మెంట్ కేసులో రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఒకవైపు చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ వచ్చినందుకు టీడీపీ శ్రేణుల్లో ఆనందం ఉన్నప్పటికీ మరోవైపు మిగిలిన కేసుల సంగతిపై ఆందోళన కలుగుతుంది. స్కిల్ స్కాం కేసులో రెగ్యులర్ బెయిల్ వచ్చినందుకే సీఐడీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తోంది. అలాంటిది మిగిలిన కేసుల్లో ఎలా ఇరికిస్తోందోనని టీడీపీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. ఇక చంద్రబాబు రాజమహేంద్రవరం జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదని... కానీ మద్యంతర బెయిల్ షరతులను ఈ నెల 28వరకు పాటించాలని హైకోర్టు సూచించింది. ఈ నెల 29 నుండి రాజకీయ కార్యకలాపాలు కొనసాగించవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే సీఐడీ అనేక కేసులు పెట్టింది. ఈ కేసుల విచారణ కూడా ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టుల్లో కొనసాగుతున్నాయి. ఆ కేసుల్లో చంద్రబాబు నాయుడుకు ఉపశమనం కలుగుతుందా? లేక ప్రతికూలంగా తీర్పు వస్తుందా? అన్న ఆందోళన కలుగుతుంది.

ఈ కేసుల సంగతేంటి?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కేసులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. స్కిల్ డవలప్‌మెంట్ కేసులో బెయిల్ వచ్చినప్పటికీ మిగిలిన కేసుల సంగతేంటని వైసీపీ ప్రశ్నిస్తుంటే.. టీడీపీ శ్రేణుల్లో కూడా కొత్త టెన్షన్ మెుదలైంది. ఎన్నికలు అయ్యే వరకు తమ అధినేత జైలుకెళ్లకూడదని బలంగా కోరుకుంటున్నారు. ఇలాంటి తరుణంలో చంద్రబాబు నాయడుపై నమోదు అయిన కేసులు తెరపైకి వచ్చాయి. చంద్రబాబు నాయుడుపై ఇన్నర్ రింగ్ రోడ్ అక్రమాలు, ఏపీ ఫైబర్ నెట్ అక్రమాలు, మద్యం పాలసీలో అవినీతి, అంగళ్లు దాడి వంటి కేసులను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఎదుర్కొంటున్నారు. ఇకపోతే అంగళ్లు దాడి ఘటనలో ఇప్పటికే చంద్రబాబు నాయుడుకు ఉపశమనం కలిగింది. ఇకపోతే ఏపీ ఫైబర్ నెట్ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఇకపోతే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అయితే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. అయితే ఈ కేసులో అరెస్ట్ చేయకుండానే రెగ్యులర్ బెయిల్‌పై విచారించలేమంటూ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

మరికాసేపట్లో ఐఆర్ఆర్ కేసు విచారణ

అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఇప్పటికే హైకోర్టులో విచారణ జరుగుతుంది. స్కిల్ స్కాం కేసులో చంద్రబాబు నాయుడు మధ్యంతర బెయిల్‌పై విడుదలైన నేపథ్యంలో ఈ కేసులో గత విచారణ సందర్భంగా ఈ నెల 28 వరకు చంద్రబాబును అరెస్ట్ చేయబోమని ఏజీ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో కేసు తదుపరి విచారణను జస్టిస్ మల్లికార్జునరావు ఈనెల 21కి వాయిదా వేశారు. దీంతో మరికాసేపట్లో ఐఆర్ఆర్ కేసుపై వాదనలు జరగనున్నాయి. ఇకపోతే స్కిల్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు జస్టిస్ మల్లికార్జున రావే బెయిల్ మంజూరు చేశారు. ఇదే న్యాయమూర్తి నేడు ఐఆర్ఆర్ కేసులో సైతం వాదనలు విని తీర్పు వెల్లడించనున్నారు.

మద్యం పాలసీ కేసుపైనా విచారణ

ఇదిలావుంటే సీఐడీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరో కేసు పెట్టింది. చంద్రబాబు హయాంలో మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ కేసులు నమోదు చేసింది. ఈకేసులో నాటి సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు నాటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలపైనా కేసులు నమోదు చేసింది. ఈ కేసులోనూ బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణ సైతం నేడు జరగనుంది.

Read More..

51 రోజుల నుంచి ప్రజలకు దూరంగా చంద్రబాబు..!

Advertisement

Next Story

Most Viewed