2024లో చంద్రబాబు చస్తాడు..జగనే మళ్లీ సీఎం: ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు

by Seetharam |
2024లో చంద్రబాబు చస్తాడు..జగనే మళ్లీ సీఎం: ఎంపీ గోరంట్ల మాధవ్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో వైసీపీ చేపట్టిన సామాజిక సాధికార యాత్రలో 2024లో చంద్రబాబు చస్తారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అత్యధిక మెజారిటీతో గెలుపొందడం ఖాయమని మళ్లీ వైఎస్ జగన్ సీఎం అవుతారని ధీమా వ్యక్తం చేశారు. ఒకప్పుడు చంద్రబాబు బస్సు యాత్ర చేశారని....ప్రస్తుతం ఆయన జైలు యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. టీడీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో చంద్రబాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలను చూస్తుంటే జైల్లో చంద్రబాబుకు ఏదైనా అపకారం తలపెట్టే అవకాశం ఉందా అని టీడీపీ శ్రేణులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌పైనా ఘాటు వ్యాఖ్యలు చేశారు. నారా లోకేశ్ యువగళం పాదయాత్ర చేసి ఇప్పుడు ఢిల్లీ చుట్టూ తిరిగే యాత్ర చేస్తున్నారని ఆరోపించారు. యువగళం పాదయాత్రకు మంగళం పెట్టి ఢిల్లీకి పారిపోయారని ధ్వజమెత్తారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర ఏమైందో తెలియదన్నారు. వారాహి విజయయాత్రలో ఏవేవో వ్యాఖ్యలు చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎక్కడకు పారిపోయాడో... ఎక్కడ యాత్ర చేస్తున్నాడోనంటూ విమర్శలు చేశారు. ఎంతమంది వైసీపీపై పోటీకి వచ్చినా... ఎంతమంది యాత్రలు చేసినా వైసీపీ విజయయాత్రను ఆపలేరని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story