- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మోడీ వ్యక్తి కాదు.. శక్తి: ప్రధానిపై చంద్రబాబు ప్రశంసల వర్షం
దిశ, వెబ్ డెస్క్: తమ కూటమికి ప్రధాని మోడీ అండ ఉందని టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. చిలకలూరిపేట బొప్పూడిలో ఉమ్మడిగా ప్రజాగళం సభ నిర్వహించారు. ఈ సభలో చంద్రబాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎన్డీయే గెలవబోతోందని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో కూటమి విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. మోడీ నాయకత్వానికి ఏపీ ప్రజలు సైతం ఉండగా ఉండాలని కోరారు. ప్రజల కోసమే పొత్తు పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ప్రజలు ఇవ్వబోయే తీర్పుపై రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉందన్నారు. బీజేపీ, టీడీపీ, జనసేన జెండాలు వేరే కావచ్చని.. కానీ ఎజెండా మాత్రం ఒక్కటేనని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం, ప్రజాస్వామ్య పరిరక్షణే తమ ధ్వేయమని చెప్పారు. మోడీ అంటే వ్యక్తి కాదని, శక్తి అని ప్రశంసించారు. ‘భారత దేశాన్ని విశ్వగురువుగా మారుస్తున్న ఒక శక్తి. మోడీ అంటే సంక్షేమం, అభివృద్ది, సంస్కరణ, భవిష్యత్తు, ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం, ప్రపంచం మెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ.’ అని చంద్రబాబు పేర్కొన్నారు. ‘మోడీ అంటే అన్నా యోజన, అవాస్ యోజన, ఉజ్వల యోజన, కిసాన్ సమ్మాన్ నిధి, పీఎమ్ ఆయూష్మాన్ భారత్, జలజీవన్.’ అంటూ చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
Read More..