బాలకృష్ణకు పద్మభూషణ్.. స్పందించిన చంద్రబాబు, జూనియర్ NTR

by Gantepaka Srikanth |   ( Updated:2025-02-03 11:51:48.0  )
బాలకృష్ణకు పద్మభూషణ్.. స్పందించిన చంద్రబాబు, జూనియర్ NTR
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ సినీ నటుడు నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna)కు పద్మభూషణ్ అవార్డు(Padma Vibhushan Award) రావడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu) స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్టు పెట్టారు. ‘పద్మభూషణ్ గుర్తింపు బాలకృష్ణకు తగిన గౌరవం. సినీ, రాజకీయ, సేవా రంగాల్లో బాలకృష్ణ అద్భుత కృషి. బసవతారకం అసుపత్రి ద్వారా బాలకృష్ణ సేవలు అందరినీ ప్రభావితం చేశాయి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. అంతకుముందు జూనియర్ ఎన్టీఆర్(NTR) కూడా ఎక్స్‌ ద్వారా స్పందించారు. ‘బాలా బాబాయ్‌కు అభినందనలు. సినీ, రాజకీయ సేవలో ఆయనకు తగిన గుర్తింపు దక్కింది’ అని జూనియర్ ఎన్టీఆర్ పేర్కొన్నారు. కాగా, మొదటగా కేంద్రం పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన జాబితాను విడుదల చేసింది. ఆ తర్వాత పద్మభూషణ్, పద్మవిభూషణ్(Padma Vibhushan) అవార్డులకు ఎంపికైన వారి జాబితాను రిలీజ్ చేసింది. ఏడుగురు తెలుగువారిని ఈ పద్మ పురస్కారాలు వరించాయి.

Advertisement

Next Story