Chandrababu Naidu: విచారణకు సహకరించడం లేదు : కస్టడీ కోరనున్న సీఐడీ

by Seetharam |   ( Updated:2023-09-25 05:28:48.0  )
Chandrababu Naidu:  విచారణకు సహకరించడం లేదు : కస్టడీ కోరనున్న సీఐడీ
X

దిశ, డైనమిక్ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఐడీ కీలక ఆరోపణలు చేసింది. రెండు రోజులపాటు కస్టడీ విచారణలో తమకు సహకరించడం లేదని సీఐడీ ఆరోపించింది. ఈ మేరకు మరోసారి కస్టీడీకి ఇవ్వాలని సీఐడీ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.ఇప్పటికే ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద తెలియజేశారు.రెండు రోజులపాటు కస్టీడీ అనంతరం చంద్రబాబును వర్చువల్‌గా ఆదివారం సాయంత్రం 5 గంటలకు సీఐడీ అధికారులు హాజరుపరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబుపై సీఐడీ తరఫు న్యాయవాది పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు కస్టడీ కోరుతూ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని సీఐడీ తరఫు న్యాయవాది వివేకానంద ఆదివారం వెల్లడించారు. ఇదిలా ఉంటే నేడు చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్ విచారణకు రానుంది. అలాగే ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్ మెంట్ మార్పు, ఫైబర్ గ్రిడ్ కేసుల్లో సీఐడీ దాఖలు చేసిన పీటీ వారంట్లపైనా నేడు విచారణ జరిగే అవకాశం ఉంది.

Read More Andhra Pradesh Latest News

Advertisement

Next Story