టికెట్ దక్కని TDP సీనియర్ లీడర్లకు చంద్రబాబు కీలక హామీ

by Satheesh |   ( Updated:2024-03-15 10:21:53.0  )
టికెట్ దక్కని TDP సీనియర్ లీడర్లకు చంద్రబాబు కీలక హామీ
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం జగన్‌ను గద్దె దించడమే లక్ష్యంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కలిసి బరిలోకి దిగుతోన్న విషయం తెలిసిందే. బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు నేపథ్యంలో టీడీపీకి చెందిన కొందరు సీనియర్ లీడర్లకు టికెట్ దక్కలేదు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దక్కని తెలుగు దేశం పార్టీ సీనియర్ నేతలకు ఆ పార్టీ చీఫ్ చంద్రబాబు కీలక హామీ ఇచ్చారు. ఇవాళ సీనియర్ లీడర్లతో ఆయన మాట్లాడుతూ.. పొత్తులో భాగంగా టికెట్ త్యాగం చేసిన సీనియర్లందరికి అధికారంలోకి రాగానే తప్పకుండా న్యాయం చేస్తానని.. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చారు. పొత్తులో భాగంగా పార్టీకి చెందిన కొందరు సీనియర్ లీడర్లకు టికెట్ దక్కకపోవడం బాధగా ఉందన్నారు.

టికెట్ దక్కలేదని ఆవేదన ఉండటం సహజమని.. కానీ ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన భరోసా ఇచ్చారు. పార్టీ అధికారంలోకి రాగానే సీనియర్లకు తగిన న్యాయం చేస్తానని మాటిచ్చారు. టికెట్ దక్కకపోయినప్పటికీ పొత్తు ధర్మం పాటించి.. ఉమ్మడి అభ్యర్థికి మద్దతు తెలిపాలని కోరారు. పార్టీ విజయం కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు. నియోజకవర్గాల్లో మూడు పార్టీల మధ్య ఏమైనా ఇబ్బందులు ఉంటే.. కూర్చుని మాట్లాడుకుందామని తెలిపారు. ఇక, టీడీపీ మిగిలిన అభ్యర్థుల జాబితాను రేపు ప్రకటిస్తామని బాబు వెల్లడించారు.

Read More..

ట్రెండీగా పొలిటికల్ యాడ్.. ఆశ్చర్యపరుస్తున్న ‘జనసేనా’ పార్టీ వీడియో

Advertisement

Next Story