- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Chandrababu Naidu : 2029 ఎన్నికలపై చంద్రబాబు కీలక ప్రకటన

దిశ, వెబ్ డెస్క్ : ఏపీ అసెంబ్లీ సమావేశాలు(AP Assembly Sessions) కొనసాగుతున్నాయి. అయితే ఈ సమావేశాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Naidu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తన ఓటమికి ఎవరూ బాధ్యులు కాదని, తన ఓటమికి తానే కారణం అని పేర్కొన్నారు. 2004, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ(TDP) ఓటమికి కారణం తానేనని, తనను ఎవరూ ఓడించలేదని అన్నారు. తాను కొన్ని పనులు చేయకపోవడం వల్లే అపుడు ఓటమి చెందామని తెలిపారు. ప్రజల కోసం పని చేస్తూ.. పార్టీని, ఎమ్మెల్యేలను సమన్వయం చేయలేక పోయాయని, ఆ పొరపాటు నుంచి ఎంతో నేర్చుకొని మళ్ళీ విజయం సాధించమని వెల్లడించారు. ప్రజాసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపితేనే ప్రజలు వెంట ఉంటారని, లేదంటే ప్రజలు మనల్ని పక్కన పెట్టేస్తారని అన్నారు. మరోసారి టీడీపీకి అలాంటి పరిస్థితి తీసుకురానని చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడారు. ఇక రానున్న ఉగాది నుంచి ఏపీలోని ప్రతి నియోజకవర్గంలో పీ4 విధానం అమలు చేస్తామని ఆయన అసెంబ్లీలో ప్రకటించారు. పేదలకు చేయూత ఇచ్చేందుకు వీలుగా జాబితా సిద్ధం చేస్తామన్నారు. 2029లో ప్రజలకు ఏం చేస్తామో ముందే చెప్పి ఎన్నికలకు వెళదామని కూటమి సభ్యులకు తెలిపారు.