- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విశాఖ డెయిరీలో అవినీతి.. రంగంలోకి దిగిన అసెంబ్లీ స్పీకర్
దిశ, వెబ్ డెస్క్: విశాఖ డెయిరీ(Visakha Dairy)లో అవినీతి జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం(Chandrababu Government) సంచలన నిర్ణయం తీసుకుంది. డెయిరీలో జరిగిన అవినీతిపై విచారించేందుకు హౌస్ కమిటీ(House Committee)ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు హౌస్ కమిటీని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు(Assembly Speaker Chintakayala Ayyannapatrudu) ప్రకటించారు. ఈ కమిటీ చైర్మన్‌గా జ్యోతుల నెహ్రూ, సభ్యులుగా బోండా ఉమ, వెలగపూడి, పల్లా, గౌతు శిరీష, రంగారావు, దాట్ల సుబ్బారావును నియమించారు. డెయిరీలో జరిగిన అవినీతిపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని హౌస్ కమిటీని స్పీకర్ అయ్యన్న ఆదేశించారు. ఈ ఆదేశాలతో విశాఖ డెయిరీలో జరిగిన అవినీతిపై విచారణ ఊపందుకోనుంది. దీంతో డెయిరీలో పని చేసిన పలువురిలో ఉత్కంఠ నెలకొంది. హౌస్ కమిటీ నివేదిక ఎలా ఉంటుందోననే టెన్షన్ ఆందోళన మొదలైంది.