- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Breaking: చంద్రబాబు ప్రమాణస్వీకారం అక్కడే.. టైమ్, వేదిక ఫిక్స్
దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎంగా చంద్రబాబు మరోసారి అధికారాన్ని చేపట్టబోతున్నారు. ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టీడీపీ 135, జనసేన 21, బీజేపీ 8 స్థానాల్లో గెలిచింది. దీంతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేందుకు తేదీ, వేదిక ఖరారు అయింది. ఈ నెల 12న ఉదయం 11.27 నిమిషాలకు సీఎంగా ఆయన ప్రమాణం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు కసరత్తులు చేస్తున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టు సమీపంలో కేసరపల్లి ఐటీ పార్క్ దగ్గర వేదికను ఏర్పాట్లు చేస్తున్నారు. తొలుత అమరావతిలో ఈ నెల 9న చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారని పార్టీ నేతలు తెలిపారు.
అయితే ప్రధానిగా మోడీ ప్రమాణస్వీకారం ఉండటంలో తేదీలో స్వల్ప మార్పులు చేశారు. తాజాగా తేదీ, వేదిక ఫిక్స్ చేశారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోడీ, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు జనసేన అధినేత పవన్ కల్యాణ్, పలువురు రాజకీయ ప్రముఖులు హాజరుకాన్నారు. ఈ నేపథ్యంలో అటు పోలీసులు సైతం అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేయనున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా గన్నవరం పరిసరాల్లో భారీ బందో బస్తు ఏర్పాటు చేయనున్నారు.