వైఎస్సార్‌కు అసలు ఏం సంబంధం? ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై చంద్రబాబు ఆగ్రహం

by Sathputhe Rajesh |   ( Updated:2022-09-21 06:45:18.0  )
వైఎస్సార్‌కు అసలు ఏం సంబంధం? ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై చంద్రబాబు ఆగ్రహం
X

దిశ, వెబ్‌డెస్క్: విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తూ అసెంబ్లీలో జగన్ సర్కార్ సవరణ బిల్లును ప్రవేశపెట్టడంపై ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి వైఎస్సార్ కు ఏం సంబంధం అని ప్రశ్నించారు. 1986లో స్వయంగా ఎన్టీఆర్ యూనివర్సిటీని ప్రారంభించారని, అలాంటి యూనివర్సిటీ పేరును జగన్ ప్రభుత్వం మార్చడం దుర్మార్గమని ఆరోపించారు. వెంటనే ప్రభుత్వం తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, లేకపోతే ఆందోళనలు తీవ్రతరం చేస్తామని చంద్రబాబు హెచ్చరించారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చాలని ఇప్పటివరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డితో సహా ఏ సీఎం ఆలోచన చేయలేదని పేర్కొన్నారు. 36 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ ఆలోచనలతో ప్రారంభమైన యూనివర్సిటీకి ఇప్పుడు ఆయన పేరు మార్చి వైఎస్సార్ పేరు పెట్టడం అర్థరహితమని ఆరోపించారు. ఏపీలో ఇప్పటివరకు ఒక్క అభివృద్ధి పని కూడా చేయని జగన్ ప్రభుత్వం.. ఉన్న వాటికే పేర్లు మార్చుతోందని విమర్శించారు.

Also Read: స్పీకర్ పై పేపర్లు విసిరేసిన టీడీపీ ఎమ్మెల్యేలు.. ఏపీ అసెంబ్లీలో టెన్షన్

Also Read: ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు.. యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ రాజీనామా

Advertisement

Next Story

Most Viewed