- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
గొట్టిపాళ్లలో టీడీపీ కార్యకర్తలపై దాడులను ఖండించిన చంద్రబాబు

X
దిశ, డైనమిక్ బ్యూరో : పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో టీడీపీ కార్యకర్తలపై విచక్షణా రహితంగా, మారుణాయుధాలతో జరిగిన దాడిని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ప్రస్తుతం మాచర్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై జిల్లా నేతలను అడిగి సమాచారం తెలుసుకున్నారు. దాడుల్లో గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చూడాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు. గ్రామంలో వైసీపీ గూండాలు ఇళ్లపై పడి గంటల తరబడి మారణహోమం సృష్టిస్తుంటే నివారించలేక పోవడం పోలీసుల వైఫల్యం కాదా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. పల్లెల్లో హింసా రాజకీయాలు చేస్తున్న వైసీపీ నేతలకు పోలీసుల మద్దతే ఈ తరహా ఘటనలకు కారణం అని చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
Next Story