వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం దిశగా కేంద్రం ఆలోచనలు!

by M.Rajitha |
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను సెయిల్ లో విలీనం దిశగా కేంద్రం ఆలోచనలు!
X

దిశ, వెబ్ డెస్క్ : ఆర్థికంగా నష్టాల్లో ఉన్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ (Vizag Steel Plant) ను సెయిల్(SAIL) (స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్) లో విలీనం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వైజాగ్ స్టీల్ ప్లాంట్ అంశంపై ఎస్బీఐతో కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు సమావేశం అయ్యారు. అనంతరం.. కేంద్ర ప్రభుత్వం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ఆర్థిక కష్టాల నుండి శాశ్వతంగా గట్టెక్కించే ప్రయత్నాలు చేస్తోంది. రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్( వైజాగ్ స్టీల్ ప్లాంట్)ను సెయిల్ లో విలీనం చేసే దిశగా ఆలోచనలు చేస్తోంది. ప్లాంట్ కు రుణాలు అందించడం, పెల్లెట్ ప్లాంట్ నిధుల కోసం ఎన్ఎండీసీ(NMDC)కి ప్లాంట్ యొక్క 2000 ఎకరాల భూమిని విక్రయించే ఉద్దేశంలో ఉందని ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

కాగా ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను గతంలోనే కేంద్ర ప్రభుత్వం విక్రయించాలని చూసింది. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు గత కొన్ని నెలలుగా ధర్నాలు చేస్తున్నారు. మిగతా స్టీల్ ప్లాంట్స్ మాదిరిగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు స్వంత గనులు లేకపోవడమే నష్టాలకు కారణమని తెలుస్తోంది. ప్రైవేటీకరణ కాకుండా కనీసం సెయిల్ లో అయినా విలీనం చేయాలని కార్మిక సంఘాలు కోరుతుండగా.. కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ఆలోచనలు చేస్తున్నట్టు సమాచారం.

Advertisement

Next Story