బిగ్ బ్రేకింగ్: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం కీలక ప్రకటన

by Satheesh |   ( Updated:21 March 2023 2:15 PM  )
బిగ్ బ్రేకింగ్: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం కీలక ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ముగిసిన అధ్యయమని కేంద్ర ప్రభుత్వం మంగళవారం పార్లమెంట్ సాక్షిగా తేల్చి చెప్పింది. ప్రత్యేక హోదా బదులు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించామని తెలిపింది. 2015-18 మధ్య ఏపీ పథకాలకు తీసుకున్న వడ్డీపై రుణాలు చెల్లించామని కేంద్రం స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిపార్సుల మేరకు ఏపీ ఆర్థికలోటు భర్తీకి ప్రత్యేక నిధులు కేటాయించామని కేంద్రం వెల్లడించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా మంగళవారం లోక్ సభలో వైసీపీ ఎంపీలు ఏపీ ప్రత్యేక హోదా అంశంపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం పై విధంగా సమాధానమిచ్చింది.

Read more:

ఉరిశిక్షకు బదులు తుపాకీతో చంపితే ఎలా ఉంటుంది?

Next Story

Most Viewed