- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Viveka Murder Case: సీబీఐ దూకుడు.. భాస్కర్ రెడ్డి విషయంలో కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
దిశ, డైనమిక్ బ్యూరో: దివంగత మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ భాస్కర్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. వైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో సీబీఐ అధికారులు వైఎస్ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అక్కడ నుంచి హైదరాబాద్‌కు తరలించారు. విచారణ అనంతరం సీబీఐ అధికారులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల పూర్తైన అనంతరం సీబీఐ మెజిస్ట్రేట్ ఎదుట వైఎస్ భాస్కర్ రెడ్డిని హాజరుపరచనున్నారు. అయితే వారం రోజులపాటు సీబీఐ కస్టడీని కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి సీబీఐ కస్టడీకి మెజిస్ట్రేట్ అనుమతిస్తారా లేక రిమాండ్‌కు తరలిస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
సీబీఐ దూకుడు
కాగా దివంగత సీఎం వైఎస్ వివేకా హత్యకేసుపై సీబీఐ మరింత వేగవంతం చేసింది. మరో 15 రోజుల్లోనే కేసు విచారణ పూర్తి చేయాల్సి ఉన్న నేపథ్యంలో సీబీఐ దూకుడు పెంచింది. ఇప్పటికే ఈకేసును ఓ కొలిక్కి తీసుకువచ్చేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. వైఎస్ వివేకా హత్యకు సంబంధించి సాక్ష్యాలను తారుమారు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అదుపులోకి తీసుకుంది. పులివెందులలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న సీబీఐ హైదరాబాద్ తరలించారు.
ఉస్మానియాలో వైద్య పరీక్షలు
హైదరాబాద్‌లో విచారణ అనంతరం మధ్యాహ్నాం ఉస్మానియా ఆస్పత్రికి వైఎస్ భాస్కర్ రెడ్డిని అధికారులు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఇకపోతే వైఎస్ భాస్కర్ రెడ్డిని వైసీపీ ఖండిస్తుంటే ప్రతిపక్షమైన టీడీపీ మాత్రం స్వాగతిస్తుంది. ఈ కేసుకు తాడేపల్లిలోని సీఎం జగన్ ఇంటికి లింకులు ఉన్నాయని ఆరోపిస్తుంది. పులివెందుల పులి పులి అని చెప్పుకునే వైఎస్ అవినాశ్ రెడ్డి ఎందుకు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని టీడీపీ నిలదీసింది. వైఎస్ వివేకా హత్యకేసులో ఇప్పటి వరకు జరిగిన అరెస్ట్‌లు ఒక ఎత్తు అయితే తాజాగా వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ మరో ఎత్తు అని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మెుత్తానికి ఈపరిణామాలు పరిశీలిస్తే వీలైనంత త్వరలోనే కేసులో చిక్కుముడి వీడే అవకాశం ఉందని తెలుస్తోంది.
సునీత పోరాటానికి కొంత న్యాయం జరిగింది: బీటెక్ రవి
వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ను తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తోంది. తాజాగా టీడీపీ నేత తొలుత ఆరోపణలు ఎదుర్కొన్న బీటెక్ రవి ఈ అరెస్ట్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ వివేకా హత్య కేసులో భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డిలు చిన్న చేపలు మాత్రమేనని.. పెద్ద చేపలు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌తో కొంతవరకు న్యాయం జరిగిందని తాను భావిస్తున్నట్లు వెల్లడించారు. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత పోరాటానికి నేడు కొంత న్యాయం జరిగినట్లు అనిపిస్తోందని బీటెక్ రవి వ్యాఖ్యానించారు. వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు ఎవరు సోష్ మీడియాలో రెచ్చగొట్టే ప్రకటనలు చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే పులివెందులలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరే రోజులు చాలా దగ్గరలోనే ఉన్నాయని బీటెక్ రవి ధీమా వ్యక్తం చేశారు.
అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారు: యరపతినేని
2019 ఎన్నికల్లో ప్రచారంలో రాష్ట్రంలో గెలవాలని వైఎస్ వివేకానందరెడ్డిని అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారు అని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఆరోపించారు. కడప ఎంపి అవినాశ్ రెడ్డి, వైఎస్ భాస్కర్ రెడ్డిలు ప్రధాన నిందితులు అని ఆరోపించారు.ఈ కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని కాపాడేందుకు సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్ళి కేంద్రంతో లాలూచీపడుతున్నారని విమర్శించారు. ఇలాంటి ముఖ్యమంత్రి అధికారంలో ఉండే అర్హత లేదని, ప్రజలు అర్ధం చేసుకోవాలని సూచించారు. ఈ హత్య కేసుకు తాడేపల్లి సీఎం నివాసానికి లింక్ ఉందని యరపతినేని శ్రీనివాస్ ఆరోపించారు. సొంత బాబాయినే చంపిన రక్త చరిత్ర కలిగిన వ్యక్తులు గురించి ప్రజలు అలోచన చేయాలని పిలుపునిచ్చారు. తాడేపల్లి నివాసానికి నోటీసులు ఇవ్వకుండా జగన్ ఆపుకున్నారని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ సోషల్ మీడియా ఫేక్ వీడియో పెడుతున్నారని ధ్వజమెత్తారు. వైసీపీ క్రిమినల్ మైండ్‌కు ఇదే నిదర్శనం అని ఎద్దేవా చేశారు. ఒకరోజు పోలీసులు విధులు నుంచి తప్పుకుంటే....వైసీపీ నాయకులను కుక్కలను కోటినట్లు తరిమికొడతారని యరపతినేని శ్రీనివాస్ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి : Remand: చంచల్‌గూడ జైలుకు వైఎస్ భాస్కర్ రెడ్డి