GITAM University: మార్చి 5, 6న గీతం వర్సిటీలో కెరీర్ ఫెయిర్

by Anil Sikha |
GITAM University: మార్చి 5, 6న గీతం వర్సిటీలో కెరీర్ ఫెయిర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: విశాఖపట్నం గీతం యూనివర్సిటీలో (GITAM University) వచ్చే నెల 5, 6 తేదీల్లో నాస్కామ్, ఏపీ ప్రభుత్వం సంయుక్తంగా కెరీర్ ఫెయిర్ నిర్వహించనున్నాయి.ఈ కార్యక్రమంలో ఐటీ, ఐటీఈఎస్ 49 కంపెనీలతో యువతకు సుమారు 10వేల ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను ఇవాళ మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్ (nara lokesh) ఆవిష్కరించారు. 2024, 2025లో ఉత్తీర్ణులైన నిరుద్యోగ యువతీ, యువత రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.

ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం లోకేశ్​టీడీపీ కేంద్ర కార్యాలయానికి చేరుకున్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణ-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు ఎన్నికలు పోలింగ్ సరళిపై అందుబాటులోని పార్టీ నేతలతో వార్ రూమ్ లో మంత్రి సమావేశం నిరర్వహించారు. పోలింగ్ తీరుతెన్నులు, పార్టీ నేతలు తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి దిశానిర్దేశం చేశారు. అందరూ ఓటు హక్కు వినియోగించుకునేలా చూడాలని ఇంఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులకు ఆదేశించారు. పోలింగ్ తీరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నేతలకు సూచనలు చేశారు.



Next Story

Most Viewed