Buddha Venkanna: చిత్తూరు వీరప్పన్‌పై చర్యలు తీసుకోండి.. డిప్యూటీ సీఎం పవన్‌కు విజ్ఞప్తి

by Gantepaka Srikanth |
Buddha Venkanna: చిత్తూరు వీరప్పన్‌పై చర్యలు తీసుకోండి.. డిప్యూటీ సీఎం పవన్‌కు విజ్ఞప్తి
X

దిశ, వెబ్‌డెస్క్: వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై బుద్ధా వెంకన్న సీరియస్ కామెంట్స్ చేశారు. సోమవారం బుద్ధా వెంకన్న మీడియాతో మాట్లాడారు. ఆయన పెద్దరెడ్డి కాదని.. ఇక నుంచి చిత్తూరు వీరప్పన్ అని పిలవాలని కీలక వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లాలో సర్వం దోచుకున్న వీరప్పన్ పెద్దిరెడ్డి అని మండిపడ్డారు. వెంటనే పెద్దిరెడ్డి ఆస్తులను ఈడీ జప్తు చేయాలని డిమాండ్ చేశారు. ఒక కామన్ మ్యాన్‌గా తాను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు పెద్దిరెడ్డి అక్రమాలపై ఫిర్యాదు చేస్తున్నా. అటవీ సంపదను దోచుకున్న అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. వారి దోపిడీకి అడ్డు వస్తాడనే భయంతోనే కుప్పంలో చంద్రబాబును ఓడించేందుకు వందల కోట్లు కొల్లగొట్టారని ఆరోపించారు. ఆయన ఓడించడం కాదు.. చంద్రబాబు దరిదాపుల్లోకి కూడా వెళ్లలేకపోయారని అన్నారు. చంద్రగిరి చెవిరెడ్డికి, తిరుపతి భూమనకు, నగరి రోజాకు వదిలి.. మిగిలిన ప్రాంతాలను మొత్తం పెద్దిరెడ్డే దోచుకున్నాడని అన్నారు.

Advertisement

Next Story