- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పేదల పెన్నిధి వంగవీటి.. బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్
దిశ, ఏపీ బ్యూరో: పేదల హృదయాల్లో దివంగత వంగవీటి మోహనరంగా చిరస్థాయిగా నిలిచిపోయారని బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం రంగా 76వ జయంతి సందర్భంగా హైదారాబాద్ లోని బీఆర్ఎస్ క్యాంప్ కార్యాలయంలో రంగా జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తొలుత రంగా చిత్రాపటానికి తోట చంద్రశేఖర్ పూలమాలలతో నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అట్టడుగు వర్గాలవారికి రంగా అండగా నిలచి వారి సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసినట్లు కొనియాడారు. కొన్ని దుష్ట శక్తులు రంగాకు వస్తున్న ఆదరణ, రాజకీయ ఎదుగదలను ఓర్వలేక ఆయన్ను అత్యంత పాశవికంగా హత్య చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగా హత్యపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన జిల్లాకు రంగా పేరు పెట్టకుండా సీఎం జగన్ వివక్ష చూపినట్లు తోట ఆరోపించారు. రంగా జపం చేస్తూ కాపుల ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తోన్నటీడీపీ, వైసీపీలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో గాజులరామారం కార్పొరేటర్ శేషగిరిరావు, రంగా అభిమానులు పాల్గొన్నారు. గుంటూరులోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాయకులు షేక్ ఖాజావలి, ఆలమూరు రఫీ, షేక్ ఖదిర్ , ఎం ప్రసాద్, షేక్ షాకీర్, షేక్ నాగూర్ వలి, షేక్ సిరాజ్ నివాళులర్పించారు.