Breaking: ఎట్టకేలకు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం

by Shiva |   ( Updated:2024-06-21 05:17:53.0  )
Breaking: ఎట్టకేలకు అసెంబ్లీలోకి అడుగుపెట్టిన పవర్ స్టార్.. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యేగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాన్ ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మేరకు ప్రొటెం స్పీకర్ బుచ్చయ్య చౌదరి ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ క్రమంలో రెండు తెలుగు రాష్టాల్లోని జనసేన నాయకులు, పవన్ కల్యాణ్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. తమ అభిమాన నాయకుడి చిరకాల స్వప్నం నెరవేరిందని.. ప్రజల మనిషికి ప్రజాసేవ చేసే సువర్ణావకాశం దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పోయిన ఎన్నికల్లో ఒకే ఒక్క అసెంబ్లీ స్థానాన్ని నిలబెట్టుకున్న జనసేన.. ఈ ఎన్నికల్లో కేటాయించిన 21 స్థానాల్లో వంద శాతం స్ట్రైక్ రేట్ 21 సీట్లను కైవసం చేసుకుని ఏకంగా పవన్ డిప్యూటీ సీఎం పిఠంపై ఆసీనులవ్వడం పట్ల ఆయన ఫ్యాన్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.

Advertisement

Next Story