Breaking: కౌంటింగ్ సమీపిస్తున్న వేళ సంచలన పరిణామం.. రీ పోలింగ్‌కు హైకోర్టులో మంత్రి అంబటి పిటిషన్

by Shiva |   ( Updated:2024-05-22 15:01:19.0  )
Breaking: కౌంటింగ్ సమీపిస్తున్న వేళ సంచలన పరిణామం.. రీ పోలింగ్‌కు హైకోర్టులో మంత్రి అంబటి పిటిషన్
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల పోలింగ్ అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాతంగా ముగిసింది. ముఖ్యంగా పల్నాడు, తిరుపతి, నరసారావుపేట, మాచర్ల, చంద్రగిరి పాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కౌంటింగ్‌ తేదీ సమీపిస్తున్న వేళ సంచలన పరిణామం చోటుచేసుకుంది. సత్తెనపల్లి నియోజకవర్గం పరిధిలోని 236, 237, 253, 254 పోలింగ్ స్టేషన్లలో రీ పోలింగ్ నిర్వహించాలంటూ ఏపీ హైకోర్టులో మంత్రి అంబటి రాంబాబు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో ఈసీ, సీఈవో సహా మరో ఐదుగురిని చేర్చారు. కాగా, ఆ పిటిషన్‌పై రేపు హైకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టనుంది. అయితే, పోలింగ్ రో మాచర్లలో ఈవీఎం ధ్వంసం కావడంతో అక్కడ రీ పోలింగ్ నిర్వహిస్తారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే ఆ వదంతులకు ఎన్నికల ప్రధాన అధికారి మీనా క్లారిటీ ఇచ్చారు. ఈవీఎం ధ్వంసం అయినా. అందులోని డేటా భద్రంగా ఉందని అన్నారు. మాచర్లలో రీ పోలింగ్ నిర్వహించే అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story