- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING: టీటీడీ బోర్డు సంచలన నిర్ణయం.. కీలక పదవి నుంచి ఆ వ్యక్తికి ఉద్వాసన
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ టీటీడీ బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మేరకు ఇవాళ బోర్డు సభ్యులు సమావేశమయ్యారు. ఇందులో భాగంగా.. తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులను ఆ పదవి నుంచి తప్పిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 9 వేల మంది కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను పెంచే ప్రతిపాదనకు బోర్టు ఆమోదం తెలిపింది.
నడక దారిలో గాలిగోపురం, ఆంజనేయ స్వామి వారి విగ్రహ వద్ద గల మోకాళ్ల మిట్ట వద్ద నిత్య సంకీర్తనార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రూ.1.69 కోట్లతో గర్భగుడి ప్రవేశ ద్వారంలో ఇప్పుడున్న బంగారు వాకిలి స్థానంలో కొత్త బంగారు వాకిళ్ల నిర్మాణ పనులను చేపట్టాలని తీర్మానం చేశారు. అలాగే, ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 24న తిరుపతి ఆవిర్భావ దినోత్సవాన్ని టీటీడీ క్యాలండర్‌లో పొందుపరచాలని పాలక మండలి నిర్ణయం తీసుకుంది.
కాగా, తిరుమల ఆలయ పరిధిలో అనేక అక్రమాలు జరుగుతున్నాయంటూ ఆయన చెప్పినట్లుగా ఓ వీడియో సోషల్ వైరల్ ఇటీవల తీవ్రంగా వైరల్ అయింది. ఈ వ్యవహారాన్ని తోటి తిరుమల అర్చకులతో పాటు ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. తిరుమలోని అర్చుకులు రమణ దీక్షితులు అసత్య ప్రచారాలు చేయడం మానుకోవాలని మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు ఆయనను తిరుమల శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకుడి పదవి నుంచి తప్పించడం సంచలనంగా మారింది.