- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
BREAKING: ఆంధ్రా రాజకీయాల్లో సంచలనం.. టీడీపీ నుంచి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం సస్పెన్షన్

దిశ, వెబ్‌డెస్క్: లైంగిక ఆరోపణలు ఎదురొంటున్న సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం శ్రీనివాస్‌ను పార్టీ హైకమాండ్ గురువారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. తనను లైంగిక వేధించారని ఓ మహిళ సీఎం చంద్రబాబుకు రాసిన లేఖలోని అంశాలను సీరియస్‌గా తీసుకున్న టీడీపీ అధిష్టానం ఎమ్మెల్యే ఆదిమూలం శ్రీనివాస్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చాక ఆ పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యేను సస్పెండ్ చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆదిమూలంపై ఆరోపణలు చేసిన మహిళ టీడీపీ సత్యవేడు నియోజకవర్గం పార్టీ కీలక నాయకురాలు కావడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో ఆదిమూలం శ్రీనివాస్ తన ప్రత్యర్థి వైసీపీ అభ్యర్థిపై విజయం సాధించారు. ఆదిమూలంను సస్పెండ్ చేయడం ద్వారా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు క్రమశిక్షణ విషయమై పార్టీ ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చినట్లయింది. అటు ఎమ్మెల్యేపై ఆరోపణలు చేసిన మహిళ తనపై ఎమ్మెల్యే సాగించిన లైంగిక దాడులకు సంబంధించి అన్ని ఆధారాలు ఉన్నాయని, ఎమ్మెల్యే తనపై మూడుసార్లు లైంగిక దాడులకు పాల్పడటానికి సంబంధించిన పెన్ కెమెరాలో ఉన్నాయని తెలిపారు.