BREAKING: టీడీపీ నేతలకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్.. దమ్ముంటే ఆ పని చేయండని కామెంట్స్

by Shiva |
BREAKING: టీడీపీ నేతలకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్.. దమ్ముంటే ఆ పని చేయండని కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: బెంగళూరులోని మాజీ సీఎం జగన్ ఇంటితో పాటు హైదరాబాద్‌లో ఉన్న సీఎం చంద్రబాబు ఇంటిని కూడా హోం టూర్ చేయాలని టీడీపీ నేతలకు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్ విసిరారు. తాడేపల్లిలో ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఇళ్ల నిర్మాణాల్లో అక్రమాలు జరిగి ఉంటే రిటైర్డ్ జడ్జి ఆధ్వర్యంలో ఆడిట్ మీరు సిద్ధంగా ఉన్నారని ఆయన అధికార పక్షాన్ని ప్రశ్నించారు. అన్ని అనుమతులు తీసుకునే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించామని అన్నారు. తాడేపల్లి ఆఫీసులో ఉన్న ఫర్నిచర్ తీసుకెళ్లమంటే వారే తీసుకెళ్లడం లేదని అన్నారు. ఒక వేళ ఫర్నిచర్‌కు డబ్బులు కట్టమంటే తామే కట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed