BREAKING: దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినోడు నాయకుడా : సీఎం జగన్‌కు బాలకృష్ణ మాస్ వార్నింగ్

by Shiva |   ( Updated:2024-04-25 12:30:05.0  )
BREAKING: దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినోడు నాయకుడా : సీఎం జగన్‌కు బాలకృష్ణ మాస్ వార్నింగ్
X

దిశ, వెబ్‌డెస్క్: దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినోడు ప్రజా నాయకుడు ఎలా అవుతాడని, ఇక మీదట దళితులపై దాడులకు పాల్పడితే ఊరుకునేది లేదని సీఎం జగన్‌‌కు హిందూపురం టీడీపీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండలం బాలంపల్లి గ్రామంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అక్కచెల్లెల్లు అంటూ వాళ్ల ఉసురు పోసుకుంటున్నారని ఆరోపిచారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసినోడు నాయకుడు ఎలా అవుతాడని ప్రశ్నించారు. ఏపీలో నాయకుడే నయవంచకుడిగా మారాడని బాలకృష్ణ ఫైర్ అయ్యారు.

ఐదేళ్ల జగన్ ప్రభుత్వంలో ప్రజలు చుక్కలు చూశారని ఆరోపించారు. ప్రభుత్వ ప్రజాధనాన్ని వైసీపీ నాయకులు పందొకొక్కుల్లా మెక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం పబ్లిసిటీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రూ.16 వేల కోట్ల ‘సిద్ధం’ హోల్డింగ‌ులు పెట్టుకున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కావాలా.. ప్రజా సంక్షేమ పాలన కవాలో ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. ఉద్యోగావకాశాలు లేక యువత పెదదోవ పడుతున్నారని ఆరోపించారు. చిన్న వయసులోనే గంజాయి, డ్రగ్స్‌కు బానిసలు అవుతున్నారని ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి ఎస్సీల మీద దాడులు, అత్యాచారాలు ఎక్కువ అయ్యాయని, వాటన్నింటికి చరమాంకం పాడే రోజు దగ్గర్లోనే ఉందిన అన్నారు.

Read More..

వైసీపీ ర్యాలీలో జూ. ఎన్టీఆర్ ఫ్లెక్సీలు, ఫొటోలు కలకలం

Advertisement

Next Story