BREAKING: ఎన్నికల వేళ జగన్ సర్కార్‌కు ఝలక్.. పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టు కీలక తీర్పు

by Shiva |   ( Updated:2024-05-10 14:39:00.0  )
BREAKING: ఎన్నికల వేళ జగన్ సర్కార్‌కు ఝలక్.. పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టు కీలక తీర్పు
X

దిశ, వెబ్‌డెస్క్: సార్వత్రిక ఎన్నికల వేళ సీఎం జగన్ సర్కార్‌కు హైకోర్టు షాకిచ్చింది. రాష్ట్రంలో అమలు అమలవుతోన్న పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదును ఎన్నికలు ముగిసే వరకు జమ చేయవద్దని ఈసీ ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సమర్ధించింది. పోలింగ్ ముగిసిన తరువాతే.. అంటే ఈ‌నెల 14న లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయవచ్చని స్పష్టం చేసింది. ముందుగా పలు పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని జగన్ ప్రభుత్వం భావించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నగదు జమకు అనుమతించాలని ప్రభుత్వం, ఈసీ అనుమతి కోరింది. రాష్ట్ర వ్యాప్తంగా కోడ్ అమల్లో ఉన్నందున ప్రభుత్వం పథకాల అమలుకు నిధుల విడుదలను నిలిపివేయాలంటూ ఈసీ ఆదేశాలు జారీ చేసింది. ఆ ఆదేశాలను సవాలు చేస్తూ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌పై సుధీర్ఘంగా విచారణ చేపట్టిన కోర్టు పోలింగ్ ముగిసేంత వరకు లబ్ధిదారుల ఖాతాల్లో నగదును జమ చేయొద్దంటూ తీర్పును వెలువరించింది.

Read More..

AP News:వైఎస్ భారతిపై సునీత కీలక వ్యాఖ్యలు..!

Advertisement

Next Story