- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: తాడిపత్రిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.. జిల్లా కలెక్టర్‌కు జేసీ ప్రభాకర్ రెడ్డి డెడ్‌లైన్
దిశ, వెబ్‌డెస్క్ : మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు, తెల్ల దొరలకు తెలుగోడి సత్తాను చాటిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటుపై రగడ కొనసాగుతోంది. తాడిపత్రిలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని జేసీ ప్రభాకర్‌రెడ్డి జిల్లా కలెక్టర్‌కు పలుమార్లు విన్నవించామని పేర్కొన్నారు. అయినా, తన డిమాండ్ పట్టింకోకపోవడంతో ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే సోమవారం లోపు విగ్రహాన్ని ఆవిష్కరించాలని కలెక్టర్‌కు డెడ్‌లైన్ విధించారు. ఎవరెవరో విగ్రహాలను అప్పనంగా తీసుకొచ్చి పట్టణాల్లో ప్రతిష్టించారని, ఒక స్వాతంత్ర సమరయోధుడి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు వైసీపీ ప్రభుత్వానికి చేతులు రావడం లేదని మండిపడ్డారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విగ్రహ ఏర్పాటుపై ఏ పార్టీ వారైనా.. రాజకీయాలు చేస్తే వాళ్లకు సంబంధించిన విగ్రహాలు పీకేస్తామని హెచ్చరించారు. చిరంజీవి నటించిన సినిమా వల్ల.. ఉయ్యాలవాడ నరసింహరెడ్డి ఎవరో ఈ తరం వారికి తెలిసిందని ఆయన అన్నారు. సోమవారం లోపు విగ్రహాన్ని ఆవిష్కరించాలని లేని పక్షంలో తామే విగ్రహాన్ని ఆవిష్కరిస్తానని జేసీ ప్రభాకర్ రెడ్డి స్పష్టం చేశారు.