Bogus Pensions: సర్కార్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరికీ పింఛన్లు కట్!

by Shiva |   ( Updated:2025-01-20 03:08:19.0  )
Bogus Pensions: సర్కార్ కీలక నిర్ణయం.. ఫిబ్రవరి 1 నుంచి వాళ్లందరికీ పింఛన్లు కట్!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అర్హులైన ప్రతి ఒక్కరికీ సాయం అందేలా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలోనే బోగస్ పింఛన్ల (Bogus Pensions)పై కూడా ప్రభుత్వం చాలా సీరియస్‌గా వ్యవహరిస్తోంది. ఏళ్లుగా ఎలాంటి అర్హతలు లేకుండానే పింఛన్లు తీసుకుంటున్న వారిని ఏరివేసేందుకు అధికార యంత్రాంగం ముమ్మరంగా తనిఖీలు మొదలుపెట్టింది. ఇటీవలే ఆరోగ్యం బాగోలేక మంచానికే పరిమితమైన వారి కోటాలో పింఛన్లు అందుకుంటున్న వారి అర్హతల తనిఖీలు ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు.

అయితే, తాజాగా దివ్యాంగుల (Disabled People) కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో దివ్యాంగుల కేటగిరిలో భారీ ఎత్తున అనర్హులు పింఛన్లు తీసుకుంటున్నారని కూటమి సర్కార్‌కు ఫిర్యాదు అందాయి. దీంతో ఆ కేటగిరీలో తనిఖీలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు దివ్యాంగ కేటగిరిలో పింఛన్లు అందుకుంటున్న వారికి ఆయా ఆసుపత్రుల్లో వైద్య పరీక్షలు చేయించనున్నారు.

ఈ నెల 22 నుంచి 30 వరకు పీజీ వైద్య విద్యార్థులు (PG Medical Students) రోజుకు 200 మంది లబ్ధిదారులకు చొప్పున పరీక్షలు నిర్వహించనున్నారు. అయితే, దీంతో ఫిబ్రవరి 1 నుంచి ఈ పింఛన్‌దారుల పరిశీలనను చేపట్టనున్నారు. పింఛన్ తీసుకునే వారు ఖచ్ఛితంగా వైద్య పరీక్షలకు వెళ్లాల్సి ఉంటుంది. ఒకవేళ వెళ్లకపోతే పింఛన్‌ను నిలిపి వేయనున్నారు. పింఛన్లు తనిఖీ చేసే టీమ్‌లో ఆర్థోపెడిక్, జనరల్‌ ఫిజీషియన్, ఈఎన్‌టీ, ఆఫ్తమాలజిస్ట్‌లు భాగస్వాములు కానున్నారు. వారి ఇచ్చే రిపోర్టు అధారంగా ఫిబ్రవరి 1 నుంచి అనర్హులకు పింఛన్‌ను నిలిపివేయనున్నారు.



Next Story