- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీనియర్‌గా సీటు ఆశించా.. అసంతృప్తి లేదు: బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: మే 13న ఏపీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో అభ్యర్థుల జాబితాలను పార్టీలు ప్రకటిస్తున్నారు. అధికార వైసీపీ 175 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా పూర్తిగా అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఇప్పటికే కొంత మంది ప్రకటించారు. దీంతో ఆశావహులు అసంతృప్తి చెందారు. ఈ మేరకే బీజేపీ పదాధికారుల సమావేశానికి కీలక నేతలు హాజరు కాలేదనే ప్రచారం జరిగింది. ఈ ప్రచారంపై బీజేపీ నేత విష్ణువర్దన్ రెడ్డి స్పందించారు. సీనియర్ నేతగా సీటు ఆశించానని చెప్పారు. ఎవరైనా సరే సీటు ఆశించడం తప్పు కాదు కాదా అని వ్యాఖ్యానించారు. బీజేపీ హైకమాండ్ నిర్ణయానికి నేతలందరూ కట్టబడి ఉండాల్సిందేనని చెప్పారు. అసంతృప్తి తాత్కాలికమని.. అన్ని సర్దుకుంటాయన్నారు. తమ పార్టీలో అసంతృప్తులు ఉండవని చెప్పారు. రాజకీయాల్లో సీనియర్, జూనియర్ ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బలమైన శక్తి ఎదగాలనేదే తన ఉద్దేశమని విష్ణువర్దన్ రెడ్డి తెలిపారు.