స్కిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ 12 మంది ఐఏఎస్‌లను విచారించాలని సీఐడీకి ఫిర్యాదు

by srinivas |   ( Updated:2023-11-02 17:36:40.0  )
స్కిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఆ 12 మంది ఐఏఎస్‌లను విచారించాలని సీఐడీకి ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్: స్కిల్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. స్కిల్ కేసులో చంద్రబాబు హయాంలో పని చేసిన 12 ఐఏఎస్‌లను విచారించాలని సీఐడీకి న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు చేశారు. టీడీపీ హయాంలో సిమెన్స్ ప్రాజెక్టు అమలు, పర్యవేక్షణ కమిటీల్లోని అధికారులను విచారణ పరిధిలోకి తీసుకురావాని కోరారు. అజయ్ కల్లంరెడ్డి, అజయ్ జైన్, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మి, ప్రేమ్ చంద్రారెడ్డి, సిసోడియా, కేవీ సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్ కుమార్, కృతిక శుక్ల, అర్జున్ శ్రీకాంత్, జయలక్ష్మిని విచారించాలని న్యాయవాది ప్రసాద్ పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా పని చేస్తున్న కొండూరు అజయ్ రెడ్డి, అప్పటి సీఎండీ బంగారు రాజులతో పాటు కార్పొరేషన్ లోని సీఎఫ్‌వో, సీఈవో, ఈడీని విచారించాలని తెలిపారు. కాంట్రాక్ట్ చెక్ పవర్‌తో సంబంధం ఉన్న వివిధ స్థాయిలోని అధికారులను సైతం విచారించాలని న్యాయవాది ప్రసాద్ కోరారు.

ఇకపోతే ఈ విషయంపై ఫిర్యాదు చేసేందుకు సీఐడీ కార్యాలయానికి వెళ్లిన న్యాయవాది ప్రసాద్‌ను సీఐడీ పట్టించుకోలేదు. దీంతో సీఐడీ చీఫ్‌కు ఆయన మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. అలాగే రిజిస్టర్ పోస్టులోనూ పంపారు. ఈ ఫిర్యాదును స్వీకరించకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు.

Advertisement

Next Story