చివరి నిమిషంలో బిగ్ సర్‌ప్రైజ్.. ఒకేసారి పవన్ కల్యాణ్‌‌కు ఇద్దరు హీరోల మద్దతు.. ఎవరెవరంటే?

by Hamsa |   ( Updated:2024-05-13 20:44:12.0  )
చివరి నిమిషంలో బిగ్ సర్‌ప్రైజ్.. ఒకేసారి పవన్ కల్యాణ్‌‌కు ఇద్దరు హీరోల మద్దతు.. ఎవరెవరంటే?
X

దిశ, సినిమా: ఎన్నికల హీట్ మాముల్‌గా లేదు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారాయి. ప్రచారాల్లో సినీ సెలబ్రిటీలు ఎంతో మంది పాల్గొంటూ హీట్ పెంచుతున్నారు. అయితే పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. దీంతో బుల్లితెర సెలబ్రిటీలతో పాటుగా.. స్టార్ హీరోలు,హీరోయిన్స్ ఆయనకు సపోర్ట్‌గా నిలుస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది తమ సోషల్ మీడియా వేదికగా ప్రకటించి ఫ్యాన్స్‌లో జోష్ నింపారు.

అయితే పోలింగ్‌కు ఒక్కరోజు ముందుగా టాలీవుడ్ యంగ్ హీరోలిద్దరు పవన్ కల్యాణ్‌కు మద్దతు తెలిపి బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలుపుతూ.. సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్టులు షేర్ చేయడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో సాయి కుమార్ కొడుకు ఆది ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్‌కు సపోర్ట్ చేస్తూ అసెంబ్లీలో చూడాలనుకుంటున్నానని తెలిపాడు.

అలాగే యంగ్ హీరో కార్తికేయ.. ‘‘ప్రియమైన పవన్ కల్యాణ్ సార్, మీరు 2 దశాబ్దాలకు పైగా మా హృదయాలలో ఉన్నారు. మీ వ్యవహారశైలిని ప్రయత్నించడం నుండి థియేటర్లలో మీ కోసం పిచ్చిగా హూటింగ్ చేయడం వరకు, మీరు మాకు గొప్ప జ్ఞాపకాలు, ఆనందకరమైన సంతోషాన్ని అందించారు. సమాజం కోసం మీ ప్రయాణంలో ఈ కీలక సమయంలో, మీకు మా అందరి నుంచి మిలియన్ల కొద్దీ శుభాకాంక్షలు, హృదయపూర్వక ప్రార్థనలు ఉన్నాయి. మీకు మరింత శక్తి సార్’’ అని రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ రెండు పోస్టులు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో పవన్ ఫ్యాన్స్ డబుల్ ధమాకా అంటే ఇది కదా అని చర్చించుకుంటున్నారు.

Advertisement

Next Story