బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో YCP తొలి విజయం..

by Mahesh |   ( Updated:2023-03-16 03:57:01.0  )
బిగ్ బ్రేకింగ్ న్యూస్.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో YCP తొలి విజయం..
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంద్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికల తొలి పలితం విడుదలైంది. ఈ ఫలితాల్లో శ్రీకాకుళం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల ఎమ్మెల్సీగా వైసీపీ అభ్యర్థి విజయం సాధించారు. ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపులో నర్తు రామారావు గెలుపొందారు. వైసీపీ అభ్యర్థికి 632 ఓట్లు, ఇండిపెండెంట్ అభ్యర్థికి 108 ఓట్లు నమోదైనట్లు తెలుస్తుంది. కాగా ఈ ఎన్నికలకు సంబంధించి మొత్తం 776 ఓటర్లు ఉండగా.. 752 మంది ప్రజా ప్రతినిధులు ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Advertisement

Next Story