- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నారా భువనేశ్వరి సంచలన నిర్ణయం.. వైరల్ మారిన భువనమ్మ పాట
దిశ వెబ్ డెస్క్: తెలుగుదేశం పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి పై దారపనేని నరేంద్ర, పెద్ది వంశీ ఆధ్వర్యంలో పల్లెపల్లె తిరిగినాదో అమ్మా భువనమ్మ- ప్రతి గడపను తట్టినాదో అమ్మామాయమ్మ జనం గుండెల్లో కొలువైనాది.. కష్టాలు కన్నీళ్లు తుడిపేసింది అనే పాటను రూపొందించారు.
కాగా ఆ పాటను నిన్న (సోమవారం) మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎంఏ షరీఫ్, టీడీ జనార్దన్, ధూళిపాళ్ల నరేంద్రతో పాటు పలువురు నాయకులు పాట సీడీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వాళ్ళు మాట్లాడుతూ నారా భువనేశ్వరిపై ప్రశంసల జల్లు కురిపించారు. చంద్రబాబు అక్రమ అరెస్టును జీర్ణించుకోలేక 206 మంది కార్యకర్తలు గుండెపోటుతో మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే బాధిత కుటుంబాలను నారా భువనేశ్వరి నిజం గెలవాలి’ పేరుతో పరామర్శిస్తూ ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. నిజం గెలవాలి పేరుతో ఆమె ఇప్పటివరకు పది విడతలుగా 33 రోజుల పాటు 6,092 కిలోమీటర్లు ప్రయాణించారని కొనియాడారు. 20 పార్లమెంటు, 66 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటించిన భువనేశ్వరి ఇప్పటివరకు 149 మంది కార్యకర్తల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించారని.. అలానే బాధితుల కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపారని తెలిపారు.
అలానే మిగిలిన బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి అలుపన్నది లేకుండా ముందుకు సాగుతున్నారని పొగడ్తల జల్లు కురిపించారు. కాగా ప్రస్తుతం భువనేశ్వరి పై రూపొందించిన పాట సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
Read More..
AP Political News: ఆంధ్రాలో ఎన్నికల కోడ్.. ఆ అంశంలో చంద్రబాబు అలెర్ట్..