బండారు అరెస్ట్ చట్ట విరుద్ధం : ఎంపీ రామ్మోహన్ నాయుడు

by Seetharam |
MP Rammohan Naidu
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీమంత్రి బండారు సత్యనారాయణ మూర్తి అరెస్ట్‌పై అల్లుడు, శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు స్పందించారు. చట్ట విరుద్ధంగా బండారు సత్యనారాయణ మూర్తిని అరెస్ట్ చేశారని ట్విటర్ వేదికగా ఆరోపించారు. ఈ అరెస్ట్‌ను తాను ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఈ మేరకు ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.‘రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు నోరెత్తరు. చిన్నారి భవ్యశ్రీ పై జరిగిన అకృత్యం పైనా మహిళా కమిషన్ కాని హోంశాఖ మంత్రి కాని స్పందించరు. చంద్రబాబుపై, నారా భువనేశ్వరిపై అసెంబ్లీ సాక్షిగా వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా నోరు పారేసుకున్నప్పుడు కేసులు ఉండవు’ అని రామ్మోహన్ నాయుడు నిలదీశారు.‘బహిరంగ సభల్లోనే అధికార పార్టీ ప్రజాప్రతినిధుల బూతులు తిట్టినా నోటీసులు ఉండవు. పోలీసులు అధికార పార్టీకి ఒక చట్టం ప్రతిపక్షానికి మరొక చట్టం అన్నట్టు గా ప్రవర్తిస్తున్న తీరు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యం బదులుగా రాజారెడ్డి రాజ్యాంగం అమలులో ఉందని అనిపిస్తుంది. చట్ట విరుద్ధంగా మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణ అరెస్ట్ విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ముమ్మాటికీ కక్ష సాధింపే’ అని ఎంపీ రామ్మోహన్ నాయుడు ఆరోపించారు.

Advertisement

Next Story