టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని విడిచిపెట్టిన పోలీసులు

by Seetharam |
టీడీపీ నేత అయ్యన్నపాత్రుడిని విడిచిపెట్టిన పోలీసులు
X

దిశ, డైనమిక్ బ్యూరో : మాజీ మంత్రి,టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడును పోలీసులు వదిలిపెట్టారు. 41 ఏ కింద నోటీసులు ఇచ్చి అయ్యన్నపాత్రుడిని పోలీసులు విడిచిపెట్టారు. ఇకపోతే శుక్రవారం ఉదయం అయ్యన్నపాత్రుడు ఢిల్లీ నుంచి విమానంలో విశాఖపట్నం చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్ పోర్టు వద్ద కృష్ణా జిల్లాకు చెందిన పోలీసులు అయ్యన్నపాత్రుడిని అదుపులోకి తీసుకుని బయలుదేరారు. ఈ విషయం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు తెలిసిపోయింది. అయితే కొంతమంది పోలీసుల వాహనాలను ఫాలో అవుతూ వచ్చారు. మరోవైపు అనకాపల్లి జిల్లాలోని వేంపాడు టోల్ ప్లాజా వద్ద పోలీసులను టీడీపీ శ్రేణులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు అయ్యన్నపాత్రుడికి 41ఏ కింద నోటీసులు ఇచ్చి వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం టీడీపీ కార్యకర్తలు, నేతలు అయ్యన్నపాత్రుడుని పక్కనే ఉన్న హోటల్‌కి తీసుకెళ్లి అక్కడ సపరిచర్యలు చేశారు. అనంతరం అక్కడ నుంచి అయ్యన్నపాత్రుడు తన నివాసానికి వెళ్లిపోయారు.

Advertisement

Next Story

Most Viewed