- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుటుంబంపై కత్తులతో దాడి.. ఒకరి పరిస్థితి విషమం
దిశ, ఏలూరు బ్యూరో: జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం మైసన్నగుడెం గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. ఒకే కుటుంబంలో ముగ్గురిపై అతి కిరాతకంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో మైసన్నగుడెం గ్రామానికి చెందిన తోనం శివ, అతని భార్య చిన్ని, కుమారుడు మంగరాజు తీవ్రంగా గాయపడ్డాడు. రక్తపు మడుగులో కొట్టి మిట్టాట్టడుతున్న వారిని స్థానికులు గమనించి హుటాహుటిన జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రి తరలించారు.
అయితే దాడిలో గాయాలు పాలైన వారు రోజువారీ కూలి పని చేసుకునే వారీగా తెలుస్తోంది. తోనం శివ వర్జీనియా పొగాకు క్యురింగ్ బేరన్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని వెళ్ళబుచ్చుతున్నారు. గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. ఓకే కుటుంబంలో ముగ్గురిపై దాడి జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను పట్టుకునే దిశలో ప్రయత్నాలు చేస్తున్నారు.
దాడికి కారణం అదేనా
ఈ తెల్లవారుజామున జరిగిన ఘటనతో ఆ గ్రామం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కుటుంబంలో ఉన్న ముగ్గురిపై దాడి జరగడంతో పలు అనుమానాలు రేకేత్తిస్తున్నాయి. బాధితులకు సంబంధించి ఆస్తుల తగాదాల విషయంలో ఏమైనా ప్రత్యర్థులు దాడి చేశారా, లేకా వివాహేతర సంబంధం కారణంగా దాడి జరిగిందా, ఆ కుటుంబం లోనే గొడవ జరిగి ఒకరిని ఒకరు దాడి చేసుకున్నారా అనే చర్చ సాగుతోంది. ఇప్పటికే పోలీసులు అదుపులో ముగ్గురు అనుమానితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఘటనపై గ్రామానికి డాగ్ స్క్వాడ్ చేరుకొని వివరాలను సేకరిస్తోంది.