Tirumala News : తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు

by M.Rajitha |
Tirumala News : తిరుమలలో వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల(Tirumala)లో వైకుంఠ ఏకాదశి(Vaikunta Ekadashi)కి టీటీడీ(TTD) విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనాలకు సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యమిస్తూ టీటీడీ పలు నిర్ణయాలు తీసుకుంది. పది రోజుల ఉత్తర ద్వార దర్శనాలకు టోకెన్లు, టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే దర్శనాలకు అనుమతించాలని నిర్ణయం తీసుకున్నారు. టోకెన్లు లేని భక్తులను క్యూలైన్​లోనికి అనుమతిని నిరాకరించారు. ప్రోటోకాల్ ప్రముఖులు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను 10 రోజుల పాటు రద్దు చేస్తూ టీటీడీ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. గోవిందమాల ధరించిన భక్తులకు ఎలాంటి స్పెషల్​ దర్శన ఏర్పాట్లు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. భక్తులకు కేటాయించిన టైం స్లాట్ ప్రకారమే వారు క్యూలైన్ల వద్దకు చేరుకోవాలని సూచించారు. మొదటి రోజు మాజీ ప్రజాప్రతినిధులు, మాజీ బ్యూరోక్రాట్లు, మాజీ చైర్మన్​లను వైకుంఠ ఏకాదశి రోజున దర్శనాలకు అనుమతిని టీటీడీ నిరాకరించింది.

Advertisement

Next Story

Most Viewed