APPSC: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. వివిధ రాత పరీక్షల తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ..!

by Maddikunta Saikiran |
APPSC: అభ్యర్థులకు బిగ్ అలర్ట్.. వివిధ రాత పరీక్షల తేదీలను ప్రకటించిన ఏపీపీఎస్సీ..!
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలోని నాలుగు వేర్వేరు ప్రభుత్వ ఉద్యోగాల(Government Jobs) భర్తీ కోసం నోటిఫికేషన్లను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఆ ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీల(Exam Dates)ను ఏపీపీఎస్సీ తాజాగా ప్రకటించింది. ఈ ఎగ్జామ్స్ అన్ని 2025 మార్చిలో జరుగుతాయని తెలిపింది. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ(Dr. NTR University)లోని అసిస్టెంట్ లైబ్రేరియన్(AL) పోస్టులకు మార్చి 24, 25వ తేదీల్లో, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్(PCB)లోని అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్(AEE) ఉద్యోగాలకు మార్చి 25న రెండు షిప్టు(Two Shifts)ల్లో ఎగ్జామ్స్ నిర్వహిస్తామంది. గ్రేడ్-2 అనలిస్ట్ పోస్టులకు మార్చి 25,26, డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్(DyEO) ఉద్యోగాలకు మార్చి 26,27వ తేదీల్లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ కార్యదర్శి ప్రదీప్ కుమార్(Pradeep Kumar) ఓ ప్రకటనలో తెలిపారు.

Next Story

Most Viewed