- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
AP: డీకే శివకుమార్‌ను కలిసిన వైఎస్ షర్మిల.. కారణం అదేనా!
by Shiva |

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేశాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ప్రచారం అప్పడే జోరందుకుంది. ఈ నేపథ్యంలోనే ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిలా రెడ్డి ఇవాళ కర్నాటక ఉప ముఖ్యమంత్రి, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. అనంతరం వారిద్దరూ ఏపీ పొలిటక్స్ గురించి చర్చించినట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ప్రచారంలో చేపట్టాల్సిన ర్యాలీలు, సభల నిర్వహణపై వైఎస్ షర్మిల, డీకేకు వివరించారు. ఇక పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో వ్యవహరించాల్సిన తీరును డీకే శివకుమార్, షర్మిళకు దిశానిర్దేశం చేశారు.
Next Story