AP TET Results-2024: అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. టెట్ ఫలితాలు విడుదల

by Shiva |   ( Updated:2024-11-04 06:36:49.0  )
AP TET Results-2024: అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. టెట్ ఫలితాలు విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (AP TET-2024) ఫలితాలను ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఇవాళ విడుదల చేశారు. అక్టోబర్ 3 నుంచి 21 వరకు రోజుకు రెండు సెషన్ల చొప్పున ఉన్నత విద్యా శాఖ టెట్‌ పరీక్షలను (TET Exams) అత్యంత పకడ్బందీగా నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 3,68,661 మంది హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పరీక్ష రాసేందుకు 4,27,300 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేసుకున్నారు.

అందులో 1,87,256 (50.79 శాతం) మంది అభ్యర్థులు అర్హత సాధించినట్లుగా అధికారులు వెల్లడించారు. అయితే, డీఎస్సీ (DSC)లో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. కాగా, త్వరలోనే ప్రభుత్వం 16,347 టీచర్ పోస్టులతో మెగా డీఎస్సీ (Mega DSC) నోటిఫికేషన్ విడుదల చేయనుంది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ఫైనల్‌ కీ (Final Key), ఫలితాలకు సంబంధించిన పూర్తి వివరాలను https://aptet.apcfss.in/ వెబ్‌సైట్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

టెట్ ఫలితాల విడుదలపై ‘X’ (ట్విట్టర్) వేదికగా మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో యువత, నిరుద్యోగులకు ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చే దిశగా సీఎం చంద్రబాబు (CM Chandrababu) నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలైలో నిర్వహించిన టెట్-2024 (TET-2024) ఫలితాలను ఇవాళ విడుదల చేశామని తెలిపారు. నిరుద్యోగ టీచర్లకు ఇచ్చిన మాట ప్రకారం.. త్వరలోనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ (Mega DSC Notificaion)ను విడుదల చేస్తామని మంత్రి నారా లోకేష్‌ ట్వీట్ చేశారు.

Advertisement

Next Story

Most Viewed