ఏపీ శాసనమండలి సెక్రటరీ జనరల్‌‌ని నియమించిన ప్రభుత్వం

by Jakkula Mamatha |   ( Updated:16 July 2024 10:25 AM  )
ఏపీ శాసనమండలి సెక్రటరీ జనరల్‌‌ని నియమించిన ప్రభుత్వం
X

దిశ,వెబ్‌డెస్క్: ఇటీవల ఏపీ శాసనమండలి సెక్రటరీ జనరల్‌ పదవికి రామాచార్యులు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈక్రమంలో చంద్రబాబు సర్కార్ సూర్యదేవర ప్రసన్న కుమార్‌ను ఏపీ శాసనమండలి సెక్రటరీ జనరల్‌గా నియమించింది. ఈక్రమంలో సూర్యదేవర ప్రసన్న కుమార్‌ను కాంట్రాక్టు పద్ధతిలో నియమిస్తూ శాసనమండలి నేడు(మంగళవారం) నోటిఫికేషన్ జారీ చేసింది. ఖమ్మం జిల్లాకు చెందిన సూర్యదేవర ప్రసన్న కుమార్ గతంలో సుప్రీంకోర్టు రిజిస్ట్రార్‌గా పనిచేశారు. లోక్ సభ స్పీకర్‌కు OSDగా, ఢిల్లీ శాసనసభ కార్యదర్శిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ఓఎస్డీగా వ్యవహరించారు. ఈ ఏడాది జనవరిలో ఆయన తెలంగాణ అసెంబ్లీ సలహాదారుగా నియమితులైనట్లు సమాచారం.

Next Story