- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
APPSC Group-2 Mains: ఏపీ గ్రూప్-2 మెయిన్స్ ఆన్సర్ 'కీ' విడుదల

దిశ, వెబ్ డెస్క్: ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. 175 పరీక్ష కేంద్రాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకూ పేపర్-1, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 వరకూ పేపర్-2 పరీక్షలు జరిగాయి. గ్రూప్-2 ప్రిలీమ్స్‌లో మొత్తం 92,250 మంది అధ్యర్థులు అర్హత సాధించగా.. 92 శాతం మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు ఏపీపీఎస్సీ అధికారులు వెల్లడించారు.
కాగా, పరీక్షలు ముగిసిన రోజే రాత్రి ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ ఆన్సర్ కీలను కూడా విడుదల చేసింది. అలాగే అభ్యర్ధుల రెస్పాన్స్‌షీట్లను కూడా వెబ్‌సైట్‌లో అందుబాటులో పెట్టింది. ప్రశ్నలు, జవాబులపై అభ్యంతరాలు ఉంటే అభ్యర్థులు ఫిబ్రవరి 25 నుంచి 27వరకు ఆన్‌లైన్‌లో అభ్యంతరాలు లేవనెత్తాలని కమిషన్ కోరింది. ఇక ఈ పరీక్షల్లో పేపర్ 1 సులభంగా ఉందని, పేపర్ 2 ఓ మోస్తరు క్లిష్టతతో ఉందని సబ్జెక్ట్ నిపుణులు పేర్కొన్నారు. పేపర్ 2లో ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల నుంచి ఎక్కువ శాతం తాజా పరిణామాలపై ప్రశ్నలు అడిగారని అన్నారు. కాగా, గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలను వచ్చే నెలకు వాయిదా వేయాలని అభ్యర్థులు ఆందోళన చేపట్టడంతో శనివారం పరీక్షల నిర్వహణపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే.
ఆన్సర్ కీ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.https://portal-psc.ap.gov.in/HomePages/KeysToPapers