- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
AP Govt.: ఏపీ సర్కార్ కీలక నిర్ణయం.. రిజిస్ట్రేషన్ విలువల పెంపు

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ విలువలను పెంచుతూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్లు-స్టాంపుల శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ (Satya Prasad, Minister of Revenue, Registrations-Stamps) మాట్లాడుతూ.. ప్రాంతాల వారీగా డిమాండ్‌ను బట్టి రిజిస్ట్రేషన్ విలువల పెంపుపై సమగ్ర నివేదిక ఇవ్వాలని అధికారులను ఇప్పటికే ఆదేశించామని పేర్కొన్నారు. గ్రోత్ కారిడార్లు (Growth Corridors), భూమి విలువ అధికాంగా పెరిగిన చోట్ల మాత్రమే పెంపుదల ఉంటుందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి రెవెన్యూ అవసరం అయినందునే రిజిస్ట్రేషన్ విలువలను పెంచాలని నిర్ణయించాయని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ (YCP Government) హయాంలో ఏలాంటి ప్రామాణికాలు పాటించకుండా రిజిస్ట్రేషన్ విలువలను ఇష్టానుసారంగా పెంచారని ఆరోపించారు. రిజిస్ట్రేషన్ విలువలు పెరిగే చోట సగటున 15 శాతం నుంచి 20 శాతం వరకు పెంపుదల ఉంటుందని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.