అలర్ట్: టెన్త్ విద్యార్థులకు AP సర్కార్ గుడ్ న్యూస్

by Satheesh |   ( Updated:2023-01-21 02:34:20.0  )
అలర్ట్: టెన్త్ విద్యార్థులకు AP సర్కార్ గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం పదవ తరగతి విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరగనున్న టెన్త్ ఎగ్జామ్స్ వార్షిక ఫీజు చెల్లించని వారికి ప్రభుత్వం మరో ఛాన్స్ ఇచ్చింది. ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు తత్కాల్ స్కీమ్ కింద రూ.500 అపరాధ రుసుముతో ఈ నెల (జనవరి) 26 లోపు.. రూ. 1000 లేట్ ఫైన్‌తో ఈ నెల 31వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పిచింది. విద్యార్థుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు తెలిపింది. అయితే, పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు పెంచడం ఇదే చివరి సారి అని.. మరోసారి అవకాశం ఉండదని అధికారులు పేర్కొన్నారు. వార్షిక పరీక్ష ఫీజు కట్టని విద్యార్థులకు ఎగ్జామ్స్ రాసే అవకాశం ఉండదని తెలిపారు. కావున ఇప్పటి వరకు పరీక్ష ఫీజు చెల్లించని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు.

Also Read...

పెన్షన్ల అమలుపై జగన్ అబద్దాలు!

Advertisement

Next Story