విద్యార్థులకు గుడ్ న్యూస్.. దీపావళి సెలవులు ఎన్ని రోజులు ప్రకటించారంటే..!

by Nagaya |
విద్యార్థులకు గుడ్ న్యూస్.. దీపావళి సెలవులు ఎన్ని రోజులు ప్రకటించారంటే..!
X

దిశ, వెబ్‌డెస్క్ : పండుగలు వస్తున్నాయంటే విద్యార్థులకు పండుగే. అందులోనూ దసరా, దీపావళి, సంక్రాంతి అంటే ఎగిరి గంతేస్తారు. మిగతా పండుగలకు ఎలా ఉన్నా.. ఈ మూడు పండుగలకు మాత్రం సెలవులు ఎక్కువ రోజులు వస్తాయి. తాజాగా దీపావళి పండుగకు ఏపీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. తెలంగాణలో దీపావళిని ఈ నెల 12న (ఆదివారం) జరుపుకుంటుండగా ఏపీలో మాత్రం 13న (సోమవారం) చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం విద్యాసంస్థలకు మూడు రోజులు సెలవులను ప్రకటించింది. శనివారం రెండో శనివారం కాగా ఆదివారం కామన్ హాలీడే. ఇక సోమవారం దీపావళి పండుగ సందర్భంగా సెలవును ప్రకటించారు. దీంతో అన్నీ విద్యాసంస్థలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. నవంబర్ 14న విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానున్నాయి.


Next Story