- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చిరంజీవే కాదు.. ఎంత మంది కలిసొచ్చినా జగన్‌ను ఓడించలేరు
దిశ, వెబ్‌డెస్క్: మెగాస్టార్ చిరంజీవిపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సజ్జల మీడియాతో మాట్లాడుతూ.. చిరంజీవి కూటమికి ఆయన మద్దతు ఇవ్వడంలో ఆశ్చర్యం లేదని చెప్పారు. చిరంజీవే కాదు.. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ గెలుపును అడ్డుకోలేరు అని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ పొలిటికల్ తెరపై ఎప్పుడో క్లారిటీ వచ్చిందని అన్నారు. గుంటనక్కలు.. తోడేళ్లు ఒక్కటయ్యాయి అని సెటైర్ వేశారు. రాష్ట్రంలో జగన్ ఒక్కడే ఒక వైపు ఉన్నారు.. జగన్‌వైపే ఏపీ ప్రజలు కూడా ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు వైసీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కూడా చిరంజీవిపై విమర్శలు చేశారు. చిరంజీవి వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని సూచించారు. ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు చిరంజీవిని పవన్ కల్యాణ్ వాడుకుంటున్నారని విమర్శించారు.
పవన్ ఎంత ఒత్తిడి చేసి చిరంజీవితో అలా చెప్పించారో అని ఎద్దేవా చేశారు. ఫ్యాన్స్‌ను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. అసలు చిరంజీవి ఏపీలోనే నివాసం ఉండరు అన్నారు. కాగా, అంతకుముందు చిరంజీవి బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, జనసేన పెందుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పంచకర్ల రమేష్‌లకు మద్దతు ప్రకటించారు. వీరిద్దరినీ గెలిపించాలని ఏపీ ప్రజలను చిరంజీవి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడటాన్ని స్వాగతించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ముందుకు వెళ్లాలనేదే తన పెద్ద కోరిక అన్నారు. అయితే, చిరంజీవి చేసిన అభివృద్ధి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారు.