- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారు.. ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం వైఎస్ జగన్
దిశ, డైనమిక్ బ్యూరో : ‘ఉద్యోగులకు ఎంతవీలైతే అంత మంచి చేయడానికి ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంది. జీపీఎస్కోసం రెండేళ్లుగా కసరత్తు చేశాం. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములు.వారు బాగుంటేనే ప్రజలు బాగుంటారు’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. తాడేపల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌ను పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలిశారు.కొత్తగా జీపీఎఎస్ తీసుకురావడం, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ప్రభుత్వంలో ఏపీవీవీపీ ఉద్యోగుల విలీనం, పీఆర్సీ కమిషన్‌ఏర్పాటు సహా రాష్ట్ర కేబినెట్, ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్‌కు ఉద్యోగ సంఘాల నేతలు కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగులకు మంచి చేయాలనే తపనతో తెచ్చిన జీపీఎస్ పెన్షన్ విధానంతో ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలు ఖచ్చితంగా అందుతాయి అని హామీ ఇచ్చారు. అంతేకాదు ఉద్యోగుల విషయంలో రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలను 60 రోజుల్లోగా అమలు చేయాలని అధికారులకు సీఎం వైఎస్ జగన్ ఆదేశాలు జారీ చేశారు.
జీపీఎస్‌తో ఎన్నో ప్రయోజనాలు
‘ప్రభుత్వం నుంచి జరగాల్సిన మంచి ఏదైనా ఉద్యోగులకు చేస్తాం. ఉద్యోగులు అనేవారు ప్రభుత్వంలో భాగస్వాములు. ఉద్యోగులు బాగుంటేనే ప్రజలు బాగుంటారని విశ్వసించిన ప్రభుత్వం మనది. మీ మనసులో కష్టం ఉండకుండా చూడాలన్నదే మా ఉద్దేశం’ అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. అందుకే పెన్షన్ సహా కొన్ని పరిష్కారాలకోసం రెండేళ్లుగా తపనపడ్డాం అని తెలిపారు. గతంలో ఎవ్వరూ కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపించడానికి తపనపడ్డ సందర్భాలు లేవు అని గుర్తు చేశారు. ఉద్యోగులకు పరిష్కారం దొరకాలి, అంతేకాకుండా భావితరాలను కూడా దృష్టిలో ఉంచుకోవాలి. దీన్ని దృష్టిలో ఉంచుకుని జీపీఎస్‌ను తీసుకువచ్చాం అని సీఎం వైఎస్ జగన్ అన్నారు. రిటైర్డ్‌ఉద్యోగుల జీవన ప్రమాణాలను కూడా నిలబెట్టేదిగా జీపీఎస్‌ను రూపొందించినట్లు తెలిపారు. 62 ఏళ్లకు రిటైర్అయితే 82 ఏళ్లలో కూడా అదే స్థాయిలో జీవన ప్రమాణాలు ఉండాలి అని ప్రభుత్వం యోచన అని చెప్పుకొచ్చారు. అందుకే ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో ఉంచుకుని డీఆర్లు ఇచ్చేలా జీపీఎస్‌లో పొందుపరిచాం అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
కాంట్రాక్ట్ క్రమబద్దీకరణకు సుదీర్ఘ కసరత్తు చేశాం
‘ప్రభుత్వ ఉద్యోగులకు న్యాయం జరగాలి, మరోవైపు నడపలేని పరిస్థితులు కూడా రాకుండా ఉండాలి. సీపీఎస్‌లో లేనివి జీపీఎస్‌లో ఉన్నాయి. రెండేళ్లపాటు జీపీఎస్‌పై ఆర్థికశాఖ సుదీర్ఘకసరత్తు చేసింది. దీని ఫలితంగానే జీపీఎస్‌ను రూపకల్పన చేశాం’ అని సీఎం వైఎస్ జగన్ ఉద్యోగ సంఘాలకు తెలియజేశారు. కాంట్రాక్ట్‌ఉద్యోగుల క్రమబద్ధీకరణపైనా కూడా మంచి ఆలోచన చేశాం అని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పులనుకూడా పరిగణలోకి తీసుకున్నట్లు వివరించారు. వారికి మంచి చేయాలన్న ఆలోచనతో అడుగులు ముందుకేశాం అని అన్నారు. అలాగే వైద్యవిధాన పరిషత్ ఉద్యోగులనుకూడా ప్రభుత్వంలో విలీనం చేశాం అని స్పష్టం చేశారు. వారికీ మంచి పరిష్కారం చూపించే దిశగా చర్యలు తీసుకుంటున్నాం అని సీఎం వైఎస్ జగన్ ఉద్యోగులకు తెలియజేశారు.